గంగవ్వ ఇళ్లు ఆలస్యం కావడానికి కారణం అదేనట

గంగవ్వ ఇళ్లు ఆలస్యం కావడానికి కారణం అదేనట

0
85

యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ అంటే తెలియని వారు ఉండరు ..ఇక అక్కడ నుంచి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది ..ఆమె ఆటతో అందరిని నవ్వించింది.. ఇక ఆమెకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, అయితే గంగవ్వ ప్రస్తుతం తన సొంత ఇంటి నిర్మాణంలో బిజీగా ఉంది.

 

మై విలేజ్ షో టీమ్ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చింది ఆమె ఇంటిపై, సుమారు 20 లక్షల రూపాయలతో ఆమెకి ఇంటిని నిర్మిస్తున్నారు, అయితే తెలిసిన కాంట్రాక్టర్ కు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.

 

రెండు బెడ్ రూమ్ లు, ఒక హాల్, కిచెన్ ఉండేలా సింపుల్ గా హౌజ్ ను ప్లాన్ చేసుకున్నారు. ఈ కరోనా వల్ల

గంగవ్వ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించినందువల్ల ఇంటి పనులు ఆలస్యం అయ్యాయట… అయితే తాజాగా ఇంటి నిర్మాణ పనులు ఇప్పుడు వేగంగా చేస్తున్నారు, త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంటిలో గృహప్రవేశం చేయనుంది గంగవ్వ. బిగ్ బాస్ ఇచ్చిన నగదుతో పాటు నాగార్జున కూడా ఆమె ఇంటికి కొంత నగదు సాయం చేశారు, ఇక తాజాగా ఆమె ఇంటికి స్లాబ్ పని పూర్తి అవుతోంది.