గ్యాంగ్ స్టర్ గంగరాజు మూవీ రివ్యూ

-

నటీనటులు : లక్ష్య్‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌ తదితరులు
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
దర్శకత్వం: ఇషాన్ సూర్య‌
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: క‌ణ్ణ పి.సి.
ఎడిటర్‌ : అనుగోజు రేణుకా బాబు

- Advertisement -

‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకు హీరో లక్ష్.రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తాజాగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం విడుదలైన ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ :

దేవరలంకకు చెందిన గంగరాజు(లక్ష్య్‌) ఫ్రెండ్స్ తో ఊరిలో పనీపాట లేకుండా తిడుతూ ఉంటాడు. ఆవారా గాడైన గంగరాజు ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై ఉమాదేవి( వేదిక దత్త) ప్రేమలో పడతాడు.ఉమాదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి నానా వేషాలు వేస్తూ ఉంటాడు. అలా జాలీ లైఫ్ అనుభవిస్తున్న గంగరాజు దేవరలంకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ సిద్దప్పని హత్య చేస్తాడు. పోరంబోకు గంగరాజు ఆ గ్యాంగ్ స్టర్ ని ఎందుకు చంపాడు? అతని చంపడం వలన గంగరాజు జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటీ? మరి ఎస్ఐ ఉమాదేవితో ప్రేమ వ్యవహారం ఏమైంది? అనేది మిగతా కథ….

విశ్లేషణ :

మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో లక్ష్‌‌ కోసం రెగ్యులర్ కథను ఎంచుకొన్నప్పటికి.. అనేక ట్విస్టులు, హాస్యంతో గాంగ్‌స్టర్ గంగరాజును కొత్తగా ఆవిష్కరించారు. ఇషాన్ రాసుకొన్న కథ.. అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఇంటర్వెల్‌కు ముందు వరకు హీరోను కథ నడిపితే.. ఇంటర్వెల్ తర్వాత హీరోనే కథను నడపడం ఇందులో స్పెషల్‌గా ఉంటుంది. దర్శకుడు ఇషాన్ సూర్య తన వంతుగా ఫర్వాలేదనిపించాడు. వలయం చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన లక్ష్.. గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో పూర్తిస్థాయిలో మాస్ హీరోగా ఆకట్టుకొన్నాడు. బాడీ లాంగ్వేజ్, పాత్ర పరంగా యాటిట్యూడ్, ఫైట్స్, పాటలతో మరోసారి ఆకట్టుకొన్నాడు. మాస్ గెటప్‌తో మంచి అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడైనప్పటికీ.. తొణుకు బెణుకు లేకుండా తెరపైన రాణించాడు. ఎమోషనల్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనబరిచాడు. మిగితా పాత్రల్లో వెన్నెల కిషోర్ తనదైన మార్కును ప్రదర్శించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ మెయిన్ విలన్ పాత్రలో మెరిసారు. హీరో తండ్రిగా గోపరాజు రమణ ఎమోషన్స్ పండించాడు. యువ హీరోయిన్ వేదిక దత్త ఇన్స్‌పెక్టర్‌గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ అయ్యంగార్ ఫన్‌తో కూడిన విలనిజాన్ని పండించారు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. గ్యాంగ్‌స్టర్ గంగరాజ్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. కణ్ణ సినిమాటోగ్రఫి బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, పాటలు సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. డ్రాగన్ ప్రకాశ్ డిజైన్ చేసిన ఫైట్స్‌ మాస్‌గా ఉన్నాయి. రేణుకా బాబు ఎడిటింగ్ బాగుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు వల్ల సినిమా చాలా రిచ్‌గా, క్లాస్‌గా ఉంది.

ప్లస్ పాయింట్స్ :

లక్స్య్ నటన
కామెడీ,
లవ్ ట్రాక్
కథనం

మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సాంగ్స్

ఫైనల్ గా గ్యాంగ్ స్టర్ గంగరాజు టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు. మూవీకి మంచి సాంగ్స్ కూడా తోడైతే ఫలితం వేరేలా ఉండేది.

రేటింగ్ : 3/5

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...