గెట్ రెడీ.. రేపే మ.. మ.. మహేశా మాస్ సాంగ్‌ వచ్చేస్తుంది

0
53

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్‌ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఇటీవలే సర్కార్ వారి పాట ట్రైలర్, కళావతి సాంగ్  రిలీజ్ చేసి మహేష్ అభిమానులకు ఆనందపరిచింది. ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టారు.  అయితే తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిపింది చిత్ర బృందం.

ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి మ..మ..మహేషా సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించి ప్రేక్షకులను ఆనంద పరిచింది. ఈ మ..మ..మహేషా సాంగ్ ను మే 7 వ తేదీ అంటే రేపు విడుదల చేస్తున్నట్లు తెలిపింది చిత్ర యూనిట్. కానీ ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు.