Thandel | “ఇక రాజులమ్మ జాతరే.. ఈపాలి ఏట గురితప్పేదేలే” అంటున్న చైతూ

-

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా నటిస్తున్న ‘తండేల్(Thandel)’ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినిమా కథ ఎలా ఉండనుందో చూపించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే యదార్థ ఘటనతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కోసం చైతూ బాడీ పెంచడంతో పాటు ఫుల్ గడ్డం పెంచి అచ్చు మత్స్యకారుడిలా మేకోవర్ అయ్యాడు.

- Advertisement -

ఇందులో కూడా నాగ చైతన్య, అతని స్నేహితులు సముద్రంలోకి వెళ్లడం, పాకిస్తాన్ సైనికులకు దొరికిపోవడం వంటి అంశాలను ఎంతో ఎమోషనల్‌గా చిత్రీకరించారు. ఇక శ్రీకాకుళం యాసలో చైతూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. “దద్దా గుర్తెట్టుకో, ఈపాలి ఏట గురితప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే”.. ‘బుజ్జమ్మ కాస్త నవ్వరాదే” అనే డైలాగులు మూవీపై అంచనాలు పెంచేశాయి. చాలా కాలం తర్వాత ఈ మూవీలో చైకు జంటగా సాయిపల్లవి నటిస్తుండడం కూడా సినిమాపై మంచి భజ్ తెచ్చింది.

కాగా ఈ సినిమా(Thandel)కు చందూ మొండేటి దర్శకత్వ వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ మీద అల్లు అరవింద్ మూవీని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: బిగ్ బ్రేకింగ్: వైసీపీకి బిగ్ షాక్.. అంబటి రాయుడు రాజీనామా..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...