గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అమెజాన్ లో రానుంది ఎప్పటి నుంచంటే

Godzilla vs Kong movie soon in Amazon prime

0
146

హాలీవుడ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకుంటాయి. ఏకంగా వేల కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తొలిరోజే ఈ సన్నివేశాలు చూసేందుకు సినిమా అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు.

అవెంజర్స్, జస్టిస్ లీగ్, అవతార్ ఇలాంటి పెద్ద సినిమాల తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం ఎంతో ఆదరణ పొందింది. ఈ మూవీ మార్చి 24, 2021 థియేటర్లలో సందడి చేసింది. వార్నర్ బ్రదర్స్, లెజండరీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మించాయి. భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ కి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా గుడ్ న్యూస్ ఏమిటి అంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా ఆగస్ట్ 14 వ తేదీన అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది. ఇక తెలుగు, హిందీ, తమిళ్లో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.