సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు తుది శ్వాస విడిచారు… చెన్నైలో చికిత్స పొందుతు ఆయన కన్నుమూశారు… గొల్లపూడి ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం… నటుడుగా, స్క్రిప్ట్ రైటర్ గా, డ్రెమటిస్ట్ గా ప్లే రైటర్ గా డైలాగ్ రైటర్ గుర్తింపు తెచ్చుకున్నారు…
గొల్లపూడి మారుతీరావు ఏప్రిల్ 14, 1939 జన్మించారు.. ఆయన తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంపాదకుడిగానూ పనిచేశారు.
సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.