గుడ్ బై చెప్పి ఎండ్ కార్డ్ వేసిన మహేష్ బాబు

గుడ్ బై చెప్పి ఎండ్ కార్డ్ వేసిన మహేష్ బాబు

0
88

అదేంటి గుడ్ బై చెప్పడం ఏమిటి, ఎండ్ కార్డ్ వేయడం ఏమిటని అనుకుంటున్నారా.. అవును సినిమా చేసే సమయంలో వారిపై చాలా ఒత్తిడి ఉంటుంది.. ఫుల్ బిజీ వర్క్ ఉంటుంది.. వన్స్ షూటింగ్ అయిపోతే ఇక సెట్స్ నుంచి సినిమా బయటకు వస్తే అంతా ఎడిటింగ్ వర్క్ లో ఉంటుంది.. అవును వచ్చే ఏడాది సంక్రాంతికి మన ముందుకు వస్తున్న ప్రిన్స్ చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రాన్ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది, ఇప్పటికే పాటలు టీజర్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ జూలై 5న స్టార్ట్ అయింది. చివరకు డిసెంబరు 18 న పూర్తి అయింది.. దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు.

సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 11న విడుదలవుతుంది. తాజాగా తన టీమ్ తో ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి , దీంతో సినిమా షూటింగ్ కు గుడ్ బై చెప్పి ఎండ్ కార్డ్ వేశారు అని కామెంట్లు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్న విషయం తెలిసిందే.