‘గుడ్​లక్​ సఖి’ కొత్త రిలీజ్​ డేట్..ఈ ఏడాది చివరి సినిమా ఇదే!

'Good Luck Sakhi' New Release Date..This Is The Last Movie Of The Year!

0
117

కీర్తి సురేశ్​ ‘గుడ్​లక్​ సఖి’ సినిమాను దురదృష్టం వెంటాడుతోంది. ఎప్పటినుంచి థియేటర్లలో చిత్రం విడుదల చేద్దామనుకుంటున్నారు కానీ కుదురడం లేదు. విడుదల తేదీలు వరుసగా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే జరిగింది.

డిసెంబరు 10న ‘గుడ్​లక్ సఖి’ రిలీజ్​ చేస్తామని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కొత్త రిలీజ్​ డేట్​ను చెప్పారు. డిసెంబరు 31న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు.

షూటింగ్​ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో కీర్తి సురేశ్.. గిరిజన యువతిగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన నగేశ్​ కుకునూర్ దర్శకత్వం వహించారు.