గుడ్ న్యూస్ చెప్పిన అను ఇమ్మాన్యుయేల్

గుడ్ న్యూస్ చెప్పిన అను ఇమ్మాన్యుయేల్

0
84

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకూ పూజా హెగ్డే, రష్మికకు సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి.. ఫుల్ కమర్షియల్ సినిమాలు అన్నింటిలోనూ వారే హీరోయిన్స్ గా చేస్తున్నారు, అయితే గత ఏడాది వరకూ అను ఇమ్మాన్యుయేల్ కు వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి, ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు, కాని ఈ మధ్య మళ్లీ తెరపై తళుక్కుమనలేదు ఈ అందాల తార.

నాని మజ్నుతో తెలుగువారికి పరిచయమైన ఈ కేరళకుట్టి… చాలా ఈజీగా క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రంలో రెండో నాయికగా నటించే అవకాశం దక్కించుకుందట ఈ సుందరి. చైతూతో శైలజా రెడ్డి అల్లుడు చిత్రం తర్వాత ఆమె కనిపించలేదు తెలుగులో ఏమీ సినిమాలు చేయకపోయినా తమిళంలోనమ్మ వీట్టు పిళ్ళై సినిమా చేసింది.

కాకపోతే, సదరు యాక్షన్ కామెడీ వల్ల తనకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. తాజాగా మళ్లీ ఆమె ఫామ్ లోకి వచ్చింది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందీ భామ…ఇందులో మెయిన్ హీరోయిన్ గా లీడ్ రోల్ గా నభా నటేశ్ కన్ ఫర్మ్ అయింది. సో కుర్రకారు హ్యాపీగా ఉన్నారు ఈ వార్తతో.