గుడ్ న్యూస్..’బింబిసార’ మేకింగ్ వీడియో రిలీజ్

0
106
కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆగష్టు 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 11వ రోజున 1.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.

దీంతో కళ్యాణ్ రామ్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సినిమా కోసం జరుగుతున్న సెట్ నిర్మాణం.. డాన్సులు, ఫైట్ కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన షార్ట్స్ పై మేకింగ్ వీడియోని వదిలారు. ఈ మేకింగ్ వీడియోలో కళ్యాణ్ రామ్ డెడికేషన్ కి అభిమానులు ఫీదా అవుతున్నారు.
ఈ వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..