తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ ఎంత పెరిగిందో తెలిసిందే… వారికి బ్రహ్మరధం పడుతున్నారు అభిమానులు.. అంతేకాదు వారికి సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ముఖ్యంగా పలు సినిమాల్లో ఛాన్సులు నేరుగా వస్తున్నాయి, ముఖ్యంగా దివి, సోహెల్, అభిజిత్, హారిక మోనాల్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి.. ఇక అవినాస్ అరియానా ఇద్దరూ కలిసి ఓ షో హోస్ట్ చేయనున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ పేరు వినిపిస్తోంది… స్టార్ హీరో గోపిచంద్ మూవీలో అఖిల్కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు, ఇక గోపీచంద్ తమన్నా నటీనటులుగా చేస్తున్నారు..
సిటీమార్ అనే సినిమాగా ఇది రానుంది.
అయితే ఇందులో ఓ కీలక రోల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి .. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన రానుంది అని తెలుస్తోంది..బావ మరదలు అనే సినిమా ద్వారా అఖిల్ వెండితెరకి పరిచయం అయ్యాడు.. అయితే తర్వాత సినిమా అవకాశాలు రాలేదు, ఇక తర్వాత పలు సీరియల్స్ లో నటించాడు , ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి.