బన్నీ అభిమానులకి మరో పండుగ ఆ ఇద్దరితో సినిమా ?

బన్నీ అభిమానులకి మరో పండుగ ఆ ఇద్దరితో సినిమా ?

0
88

అల వైకుంఠపురం చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నారు బన్నీ.. ఇక ఈ ఏడాది పుష్ప సినిమా సెట్స్ పై పెట్టారు. ఇక ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ వేళ సినిమా షూటింగుకి బ్రేకులు ఇచ్చారు.

అయితే తర్వాత మరో ఇద్దరు అగ్ర దర్శకులతో సినిమాలు చేసేందుకు బన్నీ సిద్దంగా ఉన్నారట, తాజాగా ఆచార్యతో బిజీగా ఉన్న కొరటాల శివతో సినిమా చేయలి అని బన్నీ చూస్తున్నారు, ఆచార్య తర్వాత బన్నీ కుదిరితే కొరటాలతో సినిమా చేయవచ్చు.

ఇక తారక్ తో సినిమా పూర్తి అయ్యాక త్రివిక్రమ్ నెక్ట్స్ మళ్లీ బన్నీతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు, ఇప్పటికే బన్నీకి కొరటాల త్రివిక్రమ్ కథలు వినిపించారట. ఈ ఖాళీ సమయంలో ఆ స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా ఉన్నారు, ఇక కొరటాల సినిమా పుష్ప తర్వాత పట్టాలెక్కనుందట. ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి, దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.