టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకుంటూ విశేషాప్రేక్షాదరణ సొంత చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవలే సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో అల్లుఅర్జున్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. అయితే ప్రేక్షకులందరూ ఇంతకాలం వేయికళ్లతో ఎదురుచూసిన పుష్ప పార్టు-2 వస్తుందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పుష్ప-1 సీక్వెల్ లో పుష్ప పార్ట్-2 కూడా తీయడానికి చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తూ బన్నీ ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అంటున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి మరో హీరోయిన్ కి కూడా చోటు దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఐటమ్ సాంగ్ లో దిశా పటాని కనిపించనుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి ‘భోళా శంకర్’, పవన్ ‘ హరి హర వీరమల్లు’ సినిమాలు సందడిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతుండగా..’పుష్ప 2′ కూడా అదే సమయంలో రాబోతుందనే వార్త ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది.