ఐకాన్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..పుష్ప-2 నుండి బిగ్ అప్డేట్

0
136
Pushpa 2

సుకుమార్​ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ ర‌ష్మిక నటించిన చిత్రం ‘పుష్ప‌’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలోని బన్నీ నటన, డైలాగ్స్​, సాంగ్స్​, సుకుమార్​ టేకింగ్​ ఇలా ప్రతీది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా Pushpa ది రూల్ రెండో భాగం నుండి సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. అల్లు అర్జున్‌ యూఎస్‌ లో ఉండటంతో..ఈ పూజా కార్యక్రమం దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

ఇప్పటికీ ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తగ్గదేలే డైలాగ్, శ్రీవల్లి స్టెప్ వంటివి ఇప్పటికి అభిమానులు తెగ వాడేస్తున్నారు. కాగా ‘పుష్ప’రాజ్ సీక్వెల్ లో ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.