మహేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్..’మురారి వా’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు

0
124

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. ఈ సినిమా మంచి కల్లెక్షన్స్ తో జోరు చూపించగా..తాజాగా ఎడిటింగ్‌లో తొలగించిన ‘మురారి వా’ అనే మెలోడియ‌స్ సాంగ్‌ను యాడ్ చేశారు చిత్రబృందం.

అయితే ఈ పాటకు సంబంధించి బిగ్ అప్డేట్ వదిలింది చిత్రబృందం. మురారి వా’ పాట ఫుల్ వీడియో సాంగ్‌ను బుధ‌వారం ఉద‌యం 11.07 నిమిషాల‌కు యూట్యూబ్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే సినిమాలోని అన్ని వీడియో సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ పాట‌లో కీర్తి గ్లామ‌ర్ తో, మహేష్ స్టైల్ తో  ప్రేక్షకులను ఫిదా చేసారు.