మహేష్‌ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..’సర్కారు వారి పాట’ OTTలోకి వచ్చేసింది

0
133

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాగా..సినిమా చూడాలంటే ఓటీటీ సబ్ స్క్రైబర్స్ సైతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే శరత్ విధించారు.

రూ.199 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చని చిత్రబృందం తెలిపింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్స్ లో పే పర్ వ్యూ మోడల్ లో డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుందని మేకర్స్ చెప్పడంతో అటు మహేష్, ఇటు కీర్తి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ యాడ్ చేయడంతో కాస్త ఆనందంగా ఉన్న అభిమానులు ఈ వార్తతో బాధపడక తప్పదు.