మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..చిరు ”గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్- Video

0
90

మెగాస్టార్ చిరు నటిస్తున్న మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే హీరో సత్య దేవ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రేపు చిరు పుట్టినరోజు సందర్బంగా కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి.

ఇందులో భాగంగా ‘భోళా శంకర్‌’ టీమ్‌ నుంచి ఇప్పటికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.  తాజాగా గాడ్‌ ఫాదర్  సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ టీజర్ లో బ్లాక్ కలర్ అంబాసిడర్లో.. దిగిన గాడ్‌ ఫాదర్ .. బ్లాక్ డ్రెస్‌ లో.. బ్లాక్ షేడ్స్ లో.. నెరిసిన గడ్డంతో యామా కూల్‌ గా కనిపిస్తున్నారు. సునీల్ కారు డోర్‌ తీయగా దిగిన చిరు..తన స్టైల్ మూవ్స్ తో ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇక ఈ సినిమాను విజయదశమి సందర్బంగా 05-10-2022న రిలీజ్ చేయనున్నారు.

గాడ్ ఫాదర్ టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=JO6EVchzAlI&feature=emb_title