మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’గని’ ట్రైలర్​ వచ్చేసింది (వీడియో)

0
78

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా గని ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా వరుణ్ అదరగొట్టేశాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ నిర్మించారు.

ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.  ఇప్పటికే వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ గా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించారు. ఇక గని సినిమాతో మరో హిట్ కొట్టాలని వరుణ్ కసిగా కనిపిస్తున్నాడు.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=GhMVQwp8PYs&feature=emb_title