మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్రిపాత్రాభినయంలో స్టార్ హీరో

0
109

ప్రస్తుతం యంగ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య అనుకున్న మేరకు కలెక్షన్స్ సాదించలేకపోయిన హీరోస్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈ సినిమా తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సమయంలో అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పి షూటింగ్‌ కూడా శరవేగంగా పూర్తిచేసుకుంటున్నారు చిత్రబృందం.  ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడనే వార్తలు ఇటీవలే చక్కర్లు కొట్టాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తున్నది. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్‌చరణ్‌ కనిపిస్తారని అందులో ఓ క్యారెక్టర్‌ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని సమాచారం తెలుస్తుంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.