మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..భోళాశంకర్ రిలీజ్ డేట్ లాక్

0
111

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సోమవారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా ‘భోళా శంకర్‌’ టీమ్‌ నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రం నుండి రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో చిరు, కీర్తి సురేశ్‌ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో చిరు బ్లాక్‌ అండ్‌ వైట్‌ దుస్తులు, కళ్లద్దాలు ధరించి స్టైలిష్‌, యంగ్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈపోస్టర్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తమిళంలో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ రూపుదిద్దుకుంటోంది.