మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్..ఓటిటిలో సందడి చేయనున్న విక్రమ్, విక్రాంత్ రోణ

0
115

ప్రస్తుతం ఓటిటీల హవా కొనసాగుతుంది. అయితే థియేటర్లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పలు సినిమాలు ఓటిటిలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మధ్య థియేటర్లలో కాసులు కురిపించిన సినిమాల్లో ‘విక్రమ్’ ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరక్కించిన ఈ సినిమాలో పుష్ప ఫెమ్ ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, హీరో సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ వారంలోనే జీ5లోనే స్ట్రీమింగ్ కానుంది.

కిచ్చా సుదీప్ నటించిన విక్రమ్ రాణ ఈ వారంలోనే డిస్ని+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాలోని రంగు రక్కమ్మ పాట ఎంతలా హిట్ అయిందో తెలిసిన విషయమే.

రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సోనిలీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మంచు విష్ణు, కాజల్, నవదీప్ ముఖ్య పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.