నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఓటిటిలోకి బింబిసార..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

0
169

ఇటీవల సూపర్ హిట్ అయిన సినిమాల్లో ‘బింబిసార’ ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాను వశిష్ట అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా ఆగష్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ చిత్రం మెప్పించింది. చాలాకాలం తరువాత కళ్యాణ్ రామ్ కు హిట్ ను తీసుకొచ్చింది.

ఇక తాజాగా ఓటిటి అభిమానులకు బింబిసార టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ హక్కులను ” జి 5″ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.