అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
106

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త చెప్పాడు… సంవత్సరానికి ఒక్క సినిమాను తీస్తే చాలు దేవుడా అనే ఆలోచనలో ప్రెజెంట్ సిచ్చువేషన్ లో హీరోలు ఉంటే… ఎన్టీఆర్ మాత్రం ఆరునెలల తేడాతో రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు…

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం చేస్తున్నాడు… సుమారు 400 వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద అందరి దృష్టి పడింది…. ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల చేయాలని చిత్రం బృందం ఆలోచిస్తోంది…

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు… అందుకే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఫైనల్ చేస్తున్నారట… అలావైకుంఠపురం చిత్రంతో హిట్ సాధించిన డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేసాడట ఎన్టీఆర్…