అభిమానులకు గుడ్ న్యూస్… ఎన్టీఆర్ మూవీలో ఆ బాలీవుడ్ స్టార్ నటుడు…

అభిమానులకు గుడ్ న్యూస్... ఎన్టీఆర్ మూవీలో ఆ బాలీవుడ్ స్టార్ నటుడు...

0
81

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా తీయనున్నాడు… అరవింద సమేత సినిమా హిట్ తర్వాత వీరిద్దరి కాంభినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది…

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారు… అందుకే త్రివిక్రమ్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం ఓ కీలక పాత్ర రాస్తున్నాడట… అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయలకి ముడిపడి ఉంటుందని తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది…

అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు… ఈ చిత్రానికి అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…