పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి అయింది, మరో రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టారు, ఇక ఇందులో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం తెలిసిందే, భారీ నిర్మాణంలో ఈ చిత్రం తీస్తున్నారు, ఇక
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నాటి వాతావరణంలో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు.సెట్టింగులకి కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు, అంతేకాదు నాటి పరిస్దితులు అచ్చం కనిపించేలా ఆ నేటివిటీ కోసం భారీగా సెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా విభిన్నమైన గెటప్పులో కనిపిస్తాడట.ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి సంబంధించి కీలక అప్ డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సినిమా టైటిల్ ను మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే టైటిల్ ఫిక్స్ చేశారు కాని బయటకు వార్తలు రావడం లేదు ఇక మహాశివరాత్రి రోజు ఈ ప్రకటన రావచ్చని టాలీవుడ్ టాక్.
|
|
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-