పవర్ స్టార్ అభిమానులకి గుడ్ న్యూస్ ?

పవర్ స్టార్ అభిమానులకి గుడ్ న్యూస్ ?

0
94

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఒక విషయం పైనే, ఇప్పుడు సెట్స్ పై ఉన్న వకీల్ సాబ్ చిత్రం గురించే చర్చించుకుంటున్నారు, అయితే ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు, ఇక ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తి అయింది.

జస్ట్ రెండు నెలలు షూట్ చేస్తే సినిమా ఫూర్తిగా అయిపోతుంది.డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్పై కొన్ని కోర్టు సన్నివేశాలు, మరో ఫైట్ సీన్, ఒక పాట చిత్రీకరణ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్లు న్యాయవాదులుగా కనిపించనుండగా మరో ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది.

పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 న ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి మరోసాంగ్ ఏమైనా వస్తుందా లేదా టీజర్ లాంటిది ఏదైనా వస్తుందా అని చూస్తున్నారు, మరి ప్రొడ్యుసర్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి.