పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..హరి హర వీరమల్లు నుండి గ్లింప్స్ రిలీజ్- Video

0
117

సాధారణంగా హీరో బర్త్ డే రోజున సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ను ఇస్తుంటారు మేకర్స్. ఇక నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ వరుస సర్ ప్రైజ్ లను ఇచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం పవన్ హరిహరవీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు.

మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ హరిహరవీరమల్లు. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. ఇప్పటికే సగం సినిమా షూట్‌ పూర్తైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఇక పవన్ బర్త్ డే సందర్బంగా ‘హరి హర వీరమల్లు’ నుంచి పవర్‌గ్లాన్స్‌ విడుదల చేశారు దర్శకుడు క్రిష్‌.

“మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కి తెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు” అంటూ సాగే పాటతో విడుదలైన ఈ వీడియోలో పవన్‌ లుక్‌, మేనరిజం పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మల్లయోధులతో ఆయన పోరాటం చేస్తున్న దృశ్యాలకు తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుతో సాగే ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి..

https://www.youtube.com/watch?v=J8lmfiCr7o0&feature=emb_title