ప్రభాస్ అభిమానులకు మరో సూపర్ గుడ్ న్యూస్

ప్రభాస్ అభిమానులకు మరో సూపర్ గుడ్ న్యూస్

0
88

బాహుబలి ప్రభాస్ సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు . ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో షూటింగ్ వేగంగా పూర్తిచేసే అవకాశం లేదు. ఈ సినిమాకి రాధే శ్యామ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత చిత్రాన్ని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు.

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్తో ప్రభాస్ భారీ చిత్రం చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఇది స్టార్ట్ అవ్వనుంది.
నాగ్ అశ్విన్ సినిమా తరవాత చేయబోయే ప్రాజెక్ట్ను కూడా ఫైనల్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది మరో సంవత్సరన్నర సమయం తీసుకుంటుంది అంటున్నారు, అయితే ఇది సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. చూడాలి దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు చిత్ర యూనిట్ , దీంతో ప్రభాస్ అభిమానులు మాత్రం మంచి ఖుషీగా ఉన్నారు.