ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..రాధేశ్యామ్ రెండో పాట అప్ డేట్

Good news for Prabhas fans..Radheshyam second song update

0
102

డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే తొలి గీతం అలరిస్తుండగా, రెండో సాంగ్​ టీజర్​ను సోమవారం (నవంబరు 29), ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హిందీ వెర్షన్​ మధ్యాహ్నం ఒంటి గంటకు, తెలుగు-తమిళ-కన్నడ-మలయాళ వెర్షన్​ పాట టీజర్లను సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ పాటకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ‘One Heart Two Heart Beats’ సాగే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. 1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది.

ఇందులో డార్లింగ్ హీరో పాలమిస్ట్​గా (హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్​ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.