ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ డేట్ వ‌చ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ డేట్ వ‌చ్చేసింది

0
112

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమా గురించి ఇప్పుడు అభిమానులు అంద‌రూ చర్చించుకుంటున్నారు, ఆయ‌న తాజాగా సాహో త‌ర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇక ఆయ‌న‌కు ఇది 20వ సినిమా … దీనికోసం డియర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది ఈ చిత్రంలో . రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అభిమానులు ఎప్పుడు అప్ డేట్ వ‌స్తుంది అని ఎదురుచూశారు, అయితే ఫ‌స్ట్ లుక్ వ‌స్తుంది అని ఆశించారు కాని చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఫ‌స్ట్ లుక్ ఇవ్వ‌లేదు.

మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు, తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది చిత్రం. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో సినిమా షూటింగ్ నిలిపేశారు, త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నార‌ట‌.