సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ రష్మిక నటించిన చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలోని బన్నీ నటన, డైలాగ్స్, సాంగ్స్, సుకుమార్ టేకింగ్ ఇలా ప్రతీది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే రెండో భాగం కూడా పుష్ప-2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రబృందం వెల్లడించింది. దాంతో అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు రష్మిక అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మన్యం బిడ్డగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించనున్నట్టు సమాచారం. అడవిలో ఉండే అమ్మాయి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తుంది.
సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోందని చెప్పడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అంటూ అప్పుడే జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టారు. పుష్ప నటీనటులకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయితే సాయి పల్లవికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు.