రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఓటీటీలోకి ‘రామారావు ఆన్‌ డ్యూటీ..ఎప్పుడంటే?’

0
96

మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపులలో ఉన్నారు. గతంలో వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కలెక్షన్లు పరంగా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం ‘ధమాకా’ పైనే ఆశలు పెట్టుకున్నారు ఈ ఎనర్జిటిక్ హీరో.

కాగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాకు శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఈ సినిమాలో కీ రోల్ పోషించాడు.

ఇక తాజాగా రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఓటిటి. సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ మూవీ సోనీలివ్‌‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. కాగా క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. మరోవైపు ధమాకా ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజ పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.