రవితేజ ఫాన్స్ కు గుడ్ న్యూస్..ఇవాళ ‘ఖిలాడీ’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

Good news for Ravi Teja fans..Today 'Khiladi' movie trailer released

0
87

క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ర‌వితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయ‌న‌కు కొత్త ఊపిరినిచ్చింది క్రాక్. మ‌రొక‌వైపు బ‌లుపు, డాన్‌శ్రీ‌ను త‌రువాత క్రాక్‌తో గోపిచంద్ మ‌లినేనితో ర‌వితేజ హ్యాట్రిక్ హిట్ న‌మోదు చేశారు.

ప్రస్తుతం రవితేజ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఈసినిమాలోని ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా గురించి మ‌రొక అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ట్విట్ చేసింది.
ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్, నీకితిన్ దీర్, సచిన్ ఖేడేకర్, ముకేశ్ ఋషి, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ గా తెరకెక్కుతున్నట్లు టాక్.