Sita Ramam: ‘సీతారామం’ లవర్స్ కు గుడ్ న్యూస్..ఓటిటిలోకి వచ్చేది ఆరోజే!

0
100

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ అయిన లిస్టులో సీతారామం ఒకటి. అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామంలో దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు.  ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు.

యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.  ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ తక్కువే అయిన ప్రేక్షకులు భారీ హిట్ ను ఇచ్చారు. ఇక తాజాగా సీతారామం లవర్స్ కు ఓటిటి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 9వ తేదీ నుంచి అమోజన్ ప్రైమ్‌లో ‘సీతారామం’ స్ట్రీమింగ్ కానుంది. భారీ ధరకు ఈ చిత్రం డిజిటల్ హక్కులు అమెజాన్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 80 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు పోటీగా కార్తికేయ-2 వచ్చినా కూడా కలెక్షన్లు అదే స్థాయిలో రావడం విశేషం.