సూపర్ సార్ మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..SSMB#28 ఆరంభం అంటున్న త్రివిక్రమ్-Video

0
115

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు మ‌హేశ్​ బాబు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుండగా..మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు.

అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్. మహేష్ ఈ సినిమాలో స్పెషల్ ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్. ఇందుకోసమే మహేష్ రఫ్ లుక్ లోకి మారారని అంటున్నారు. ఇక ఇటీవలే మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ను ఇచ్చింది త్రివిక్రమ్ అండ్ యూనిట్.

ఈ సినిమా షూటింగ్ ను ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభించారు. లొకేష‌న్ లో జ‌రుగుతున్న కొన్ని తెర వెనుక స‌న్నివేశాల‌తో అభిమానుల కోసం ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో మహేష్ లుక్ కనిపించకుండా మేనేజ్ చేశారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=6SSJm38VFk0&feature=emb_title