సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

0
112

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మే 12న థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహించగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తూ రికార్డ్స్ క్రీయేట్ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో కూడా చేరింది.

తాజాగా మహేష్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది అమెజాన్‌ ప్రైమ్‌. జూన్‌ 23 వ తేదీన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లోస్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది అమెజాన్‌ ప్రైమ్‌.