సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

Good news for superstar Mahesh Babu fans

0
112

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. ఇటీవల కరోనా బారిన పడిన ప్రిన్స్ మహేష్ బాబు… ఇవాళ ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా నెగిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

జనవరి 6వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం తో కరోనా పరీక్షలు చేయించుకున్న మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా బారినపడ్డ అనంతరమే… మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మృతి చెందారు. దీంతో రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు దూరమయ్యారు.

ఇదిలా ఉండగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్, రాజమౌళి, వంశీ పైడిపల్లితో సినిమాలు చేయనున్నాడు ప్రిన్స్. అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరూ సినిమా రాగా మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు తెలుస్తుంది.