విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఓటిటిలోకి ‘లైగర్’..ఎప్పుడు, ఎందులోనో తెలుసా?

0
140

డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. విజయ్ కు తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ, కీలక పాత్రలో మైక్ టైసన్ నటించారు. రౌడీ హీరోతో  అనన్య పాండే రొమాన్స్ చేసింది.

అయితే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి షో నుంచి విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఓటిటి. లైగర్’ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది.

దక్షిణాది భాషలతో పాటు హిందీ డిజిటల్ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ భారీ మొత్తానికి డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది.  అయితే ఈ మూవీ 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ తొలి వారంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కావొచ్చు.