గుడ్ న్యూస్..ఈ నెలలో ఆ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా కేజీఎఫ్‌-2

0
99

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టించింది. ఈ నెల 14న విడుదలైన కెజిఎఫ్-2 మూవీ రిలీజ్ అయ్యి  పాన్ ఇండియా స్థాయిలో  మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా చూడడానికి జనాలు ఎగపడుతున్నారు.

మొదటి భాగానికి మించిన వసూళ్లను చిత్రబృందం తమ ఖాతాల్లో వేసుకుంటుంది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రైమ్ వినియోగదారులు ఫ్రీగా చూసే చక్కని వెసులుబాటు కల్పిస్తున్నారు.

అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా చూడాలనుకుంటే రూ.199 చెల్లించి చూస్తుండగా..తాజాగా జూన్ 3 నుంచి ప్రైమ్ వినియోగదారులు ఫ్రీగా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూసే అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను ఆ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చని అమెజాన్ ప్రైమ్ వారు తెలిపారు.