గుడ్ న్యూస్..ద్విపాత్రాభినయంలో ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో

0
97

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. తనదైన శైలిలో నటిస్తూ విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది.

అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తన్నా క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు ఒకే చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జూలై రెండవ వారంలో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే నటించిన రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దాంతో తాజాగా చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా..ప్రతినాయకుడిగా తారకరత్న కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే..మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు అనే సమాచారం తెలుస్తుంది.