కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కోసం యావత్ సినిమా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు, ఎప్పుడు వెండి తెరపై ఈ సినిమా చూస్తామా అని అందరూ చూస్తున్నారు. కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్బస్టర్ హిట్ చిత్రం కేజీఎఫ్-1… ఈ చిత్రం తర్వాత పార్ట్ 2 కేజీఎఫ్ 2 ఉంటుంది అని చిత్ర యూనిట్ చెప్పింది, సో ఇక ఈ సినిమాపై నాటి నుంచి హైప్ క్రియేట్ అయింది.
అయితే కన్నడ నటులు అభిమానులే కాదు యావత్ దేశం చూస్తోంది, ఇక సినిమా యూనిట్ నుంచి కీలక ప్రకటన వచ్చేసింది. అభిమానులు మాత్రం కొద్ది నెలలుగా ఈ సినిమా గురించి అప్ డేట్ ఇవ్వాలి అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్కు వరుస సందేశాలు పంపుతున్నారు.
తాజాగా కేజీఎఫ్-2 టీజర్ విడుదల తేదీని వెల్లడించారు.యశ్ పుట్టిన రోజుకు జనవరి 8 టీజర్ విడుదల చేస్తాం. టీజర్ వేరే లెవల్లో ఉంటుంది అని తెలిపారు, సో యశ్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు..అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే.