గుడ్ న్యూస్ చెప్పిన సోనూ సూద్ ఫ్యాన్స్ హ్యాపీ

గుడ్ న్యూస్ చెప్పిన సోనూ సూద్ ఫ్యాన్స్ హ్యాపీ

0
103

సినిమా పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారు చాలా మంది కోలుకుంటున్నారు.. అయితే సినిమా నటుడు సోనూసూద్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే, ఆయనకు కరోనా సోకింది అని తెలియగానే వెంటనే సినిమా అభిమానులు ఆయన ఫ్యాన్స్ దేశంలో ఆయనని అభిమానించే వారు అందరూ షాక్ అయ్యారు… అయితే ఆయన కోలుకుంటున్నాను అని ఆందోళన వద్దు అని తెలిపారు.

 

తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నాను అని తెలిపారు.. అంతేకాదు నేడు చేసిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగిటీవ్ వచ్చింది. ఈ లాక్ డౌన్ కాలంలో గత ఏడాది కాలంగా ఎంతో మందికి సాయం చేస్తున్న ఈయన.. కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డారు.

 

ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయనకు కరోనా సోకింది అని తెలిసి అందరూ షాక్ అయ్యారు, ఇక ఇన్ని రోజులు క్వారంటైన్ లోనే ఉన్నారు ఆయన. ఇక తాజాగా కరోనా నెగిటీవ్ అని తెలిపారు అభిమానులకు …ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు.