గొప్పసాయం చేసిన హీరో రాజశేఖర్

గొప్పసాయం చేసిన హీరో రాజశేఖర్

0
142
????????????????????????????????????

ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల మార్కెట్లు అస్తవ్యస్తం అయ్యాయి, ఎక్కడా పనిలేక ఇబ్బంది పడుతున్నారు జనం, మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి..మన దేశంలో కూడా ఇది పంజా విసురుతోంది, అందుకే జనతా కర్ఫ్యూ కూడా పాటించాం.. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించాయి.

మన దేశంలో ఇప్పటికే కరోనా వల్ల 325 మంది దీని భారిన పడ్డారు. ఈ రోజు ఒక్కరోజు ముగ్గురు చనిపోయారు. దేశంలో మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది. ఇక సినిమా పరిశ్రమలో షూటింగులు నిలిచిపోయాయి, అలాగే టెలివిజస్ షూటింగులు రద్దు చేసుకున్నారు.

దీంతో సినిమా ఇండస్ట్రీలో పని చేసేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతిరోజూ ఇలా పని చేసుకునే వారికి కష్టాలు మామూలూగా లేవు.. కృష్ణానగర్ పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి… అక్కడ పేద కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు…తాజాగా హీరో రాజశేఖర్ . చిత్రపరిశ్రమకు చెందిన పేద కళాకారులకు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం అందించారు. వారికి పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు, దీంతో చాలా మంది ఆయనని ప్రశంసిస్తున్నారు.