మునుగోడులో ఉప ఎన్నికకను నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్ ప్రకటించటంతో, తెలంగాణలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా తమ పవర్‌ను నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుండగా.. తమ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ సాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. ఇక తెలంగాణాలోని తమ పాగా వేయాలని బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో భాగంగానే మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులను కదుపుతోంది. మునుగోడులో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్‌ను సంప్రదించినట్లు సమాచారం. అందుకు ఆమె సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ జీవతకు ఫోన్ చేసి, మునుగోడులో బీజేపీ తరఫున ప్రచారం చేయాల్సిందనిగా ఆహ్వానించటంతో.. జీవిత తప్పకుండా చేస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెల భార్యతో కలిసి, జీవిత రాజశేఖర్ మునుగోడులో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.