టాలీబుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిసి చేస్తున్న RRR మూవీ పై అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అందరికి తెలిసిన విషయమే… తాజాగా ఇందులో ఒక హీరోయిన్ గా నటిస్తున్న అలియాభట్ ని ఈ ప్రాజెక్ట్ లో నుంచి తొలగిస్తున్నారని సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది…
దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిలో అలియా కూడా ఒకరు… పైగా అలియా లేటెస్ట్ మూవీ సడక్ 2 ట్రైలర్ కి మిలియన్స్ లో డిస్ లైక్ లు రావడం తో ఈ ఎఫెక్ట్ అయన RRR మూవీ పై పడుతుందేమో అన్న అనుమానంతో అలియా ను తీసేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు వార్తలొచ్చాయి…
అయితే ఈ సంగతి రాజమౌళి వరకు వెళ్లడం తో జక్కన్న ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు… అలియా ను తన సినిమాలో తీసెయ్యటం లేదని ఇదంతా ఎవరో పుట్టిస్తున్న పుకార్లని అయన చెప్తున్నారు… ఎవరెన్ని రాసినా అలియానే తన హీరోయిన్ అంటూ కుండబద్దులు కొడుతున్నారట రాజమౌళి..