గ్రాండ్ గా ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

0
92

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది.పాలిటిక్స్ లో ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. లేదంటే ఎదుటివారి చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుంది. అయితే గాడ్ ఫాదర్ కు మాత్రం రాజకీయం చాలా తేలిక. ఇదే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా నుండి రాజకీయం ఇంకా దూరం కాలేదంటూ మెగాస్టార్ ఓ ఆడియో బైట్ ను ఇటీవల వదిలారు. అది నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ మూవిలోదనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ పై పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ ఈవెంట్ ను సెప్టెంబర్ 28న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ప్రారంభం కానుంది.