గ్రాండ్ గా ‘విరాట‌ప‌ర్వం’ ప్రీ రిలీజ్ వేడుక..గెస్ట్‌లుగా ఎవరు వస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

0
104

రానా ద‌గ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.

తాజాగా విరాట‌ప‌ర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మనముందుకొస్తున్నాడు. విరాట‌ప‌ర్వం గ‌తేడాది ప్ర‌థ‌మార్థంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కరోనా మహమ్మారి కారంణంగా అన్ని సినిమాలలాగే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో మనకు కనబడనుండగా..సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో  ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. విరాట ప‌ర్వం ప్రీ రిలీజ్ వేడుక త్వ‌ర‌లో జరగనుండగా..ఈ వేడుకకు గెస్ట్‌లుగా వెంక‌టేష్‌, రామ్‌చ‌ర‌ణ్ తేజ్ రానున్న‌ట్లు స‌మాచారం తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే అభిమానుల అనడానికి హాంతే ఉండదు.