కరోనాతో ప్రపంచం అల్లాడి పోతోంది, ఈ విపత్కర పరిస్దితిలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి అని ప్రభుత్వం కూడా చెబుతోంది.. ఈ సమయంలో పోలీసులు డాక్టర్లు చేసే సేవ వెలకట్టలేనిది అనే చెప్పాలి.
పెద్ద ఎత్తున వారు ప్రపంచానికి సేవ చేస్తున్నారు, అయితే వారి ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్నారు వైద్యులు, ఇక వారికి కూడా ఈ వైరస్ సోకుతున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి.
కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాల్ని కొనిచ్చాడు యువ కథానాయకుడు నిఖిల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, మిగిలిన సిబ్బందికి వీటిని పంచినట్లు ఆయన ట్వీట్ చేశారు.
2000 రెస్పిరేటర్స్,
2000 పునర్వినియోగించే చేతి గ్లౌజులు,
2000 కంటి రక్షణ అద్దాలు, శానిటైజర్లు,
10 వేల మాస్కుల్ని వైద్యులకి అందించారు