పవన్ సినిమాకి నో చెప్పిన హరీష్ శంకర్

పవన్ సినిమాకి నో చెప్పిన హరీష్ శంకర్

0
125

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బీజీగా ఉన్నారు, అయితే ఈ సమయంలో ఆయన సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి .. తాజాగా ఆయన గురించి మరో వార్త వినిపించింది. ఆయన బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ చేస్తారు అని అనుకుంటున్నారు. ఈ సినిమాకి తాజాగా వేణు శ్రీరామ్ దర్శకుడు అని భావిస్తున్నారు.

కాని ఆయన కంటే ముందు మరో దర్శకుడిని అడిగారట, ఆయనే హరీష్ శంకర్, కాని ఆయన పవన్ తో ఈ సినిమా చేయను అని చెప్పారట.. దీనికి కారణం హరీష్ శంకర్, ఇప్పటికే టాలీవుడ్ లో రీమేక్ చిత్రాలు తీస్తున్నారు అనేముద్ర వేయించుకున్న ఈ సమయంలో , మళ్లీ స్టార్ హీరోతో రీమేక్ వద్దు అని భావించారట. అందుకే ఈ సినిమాని వేణు శ్రీరామ్ చేతికి అప్పచెబుతున్నారు అని తెలుస్తోంది.

మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సొంత కథలు హిట్ అయ్యాయ అలాగే , గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి రీమేక్ సినిమాలు విజయం సాధించాయి. ఈ సమయంలో పవన్ తో ఇలాంటి సాహసం వద్దు అని హరీష్ సైడ్ కు వెళ్లారట.