హరీష్ శంకర్ కి అఖిల్ ఆ విషయంలో ఒకే చెబుతారా

హరీష్ శంకర్ కి అఖిల్ ఆ విషయంలో ఒకే చెబుతారా

0
109

తెలుగులో హరీష్ శంకర్ మంచి మాస్ సినిమాలు తీశారు, తెలుగులో పూరీ వినాయక్ తరువాత హరీష్ శంకర్ కూడా అదే రేంజ్ సినిమాలు తీశారు… ఇటీవల వచ్చిన గద్దలకొండ గణేశ్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి హీరోలకి కథలను వినిపిస్తూ తన ప్రయత్నాలను తను చేస్తూనే వున్నాడు శంకర్ .

ఇక దాదాపు రెండు కథలని సిద్దం చేసుకుని హీరోలకి వినిపిస్తున్నారు ఆయన, తాజాగా అక్కినేని అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట…. అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు… ఆ తరువాత సినిమాకిగాను ఆయన ఎవరికీ ఓకే చెప్పలేదు.

దీంతో హరీష్ శంకర్ ఆ సినిమా కథని అఖిల్ కు ఇచ్చి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాస్త కథలో చిన్న చిన్న మార్పులు చేయాలి అని చెప్పారట.. దీంతో ఈ సినిమాని ఒకే చేస్తారు అని తెలుస్తోంది.